ప్రమాదం జరిగాకే స్పందనా..? ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేక ప్రజల ప్రాణాలతో చెలగాటం!

నేరేడుచర్ల(ప్రజావాణి):సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని రామాపురం పరిధిలోని ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఎలాంటి రక్షణ కంచె (ఫెన్సింగ్) లేదా ప్రహరీ గోడ లేకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు, ప్రాణభయంతో జీవిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఫోటోలో కనిపిస్తున్నట్లుగా ట్రాన్స్‌ఫార్మర్‌లు పూర్తిగా బహిరంగంగా ఉండటంతో రోడ్డుపై నడిచే ప్రజలు, చిన్నారులు, వాహనదారులు అనుకోకుండా వాటికి దగ్గరగా వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ లీకేజీలు, షార్ట్‌సర్క్యూట్‌లు...