prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:20 pm Digital Edition : NARESH HUZURNAGAR

ప్రమాదం జరిగాకే స్పందనా..? ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేక ప్రజల ప్రాణాలతో చెలగాటం!

నేరేడుచర్ల(ప్రజావాణి):సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని రామాపురం పరిధిలోని ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఎలాంటి రక్షణ కంచె (ఫెన్సింగ్) లేదా ప్రహరీ గోడ లేకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు, ప్రాణభయంతో జీవిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఫోటోలో కనిపిస్తున్నట్లుగా ట్రాన్స్‌ఫార్మర్‌లు పూర్తిగా బహిరంగంగా ఉండటంతో రోడ్డుపై నడిచే ప్రజలు, చిన్నారులు, వాహనదారులు అనుకోకుండా వాటికి దగ్గరగా వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ లీకేజీలు, షార్ట్‌సర్క్యూట్‌లు జరిగే ప్రమాదం మరింత పెరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.అదేవిధంగా పశువులు,వంటి మూగజీవాలు ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్దకు చేరుకుంటే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ బలమైన ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ నిర్మించి ప్రజలు, మూగజీవాల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా, ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు చేపట్టడం మంచిది అని స్థానికులు కోరుతున్నారు.

మామిడి వెంకటేశ్వర్లు స్థానిక రైతు

ట్రాన్స్ఫార్మర్ ఇలా బహిరంగంగా ఉండడం వలన మూగా జీవాలకు,ట్రాక్టర్ గడ్డిలోడ్లు, వడ్ల లోడ్లు తీసుకెళుతున్న సమయంలో ప్రమాదకరంగా ఉంటుంది.అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ గోడలను నిర్మించవలసిందిగా కోరుతున్నాం.