prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 3:31 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వ బడి బలోపేతం ద్వారానే బడుగులకు విద్య డి.ఎస్.పి – రాజేంద్రప్రసాద్.

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదుకూరు నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్ అధ్యక్షతన పదవ తరగతి ఫలితాలలో ఇంగ్లీషు విభాగంలో టాప్ -10 ఉర్దూ విభాగాలలో టాప్ -3 ప్రతిభగల విద్యార్థుల అభినందన సభ కు ముఖ్య అతిథులుగా మైదుకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్, మైదుకూరు మండల విద్యాశాఖ అధికారి టీ.ఎం పద్మలత హాజరైన సమావేశంలో డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభకు నిలయాలని ప్రభుత్వ పాఠశాల బలోపేతం ద్వారానే పేద బడుగు బలహీన వర్గాలకు విద్య అందుతుందని ఆ విధముగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతిభ గల ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులలో ఉంటారని తల్లిదండ్రులు, ప్రజలు పిల్లలను ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని ఈ ఫలితాలు ద్వారానే తేట తెల్లమవుతుందని కొనియాడారు,విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పుస్తక పఠనం ద్వారానే విద్యార్థి అభివృద్ధి ఉంటుందని చెడు అలవాట్లకు,చెడు వ్యసనాలు దూరంగా ఉండాలని విద్యార్థులు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని కోరారు.విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం వైపే పైలించాలని సూచించారు.మండల విద్యాశాఖ అధికారి పద్మలత మాట్లాడుతూ మైదుకూరు ప్రాంతంలో విద్యార్థులు జిల్లాలోనే 592 మార్కులతో పసల ఉదయ శ్రీ జిల్లా లో రెండోవ స్థానం సాధించారని చాలామంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యధిక మార్కులు సాధించారని విద్యార్థులు ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరారు.యూ.టి.యఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై. రవికుమార్ మాట్లాడుతూ యుటిఎఫ్ ఫిబ్రవరి మాసం నుంచే ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందాం ప్రచారము విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేపడుతున్నదని ప్రభుత్వ బడి ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు విద్య ఉంటుందని ఆ విధంగా ప్రభుత్వం బలోపేతం చేయాలని ఊరి బడిని ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు కాపాడుకోవాలని మన మైదుకూరు ప్రాంతంలో ప్రభుత్వ బడిలో చదివి ఎంతోమంది ఉన్నత స్థానాలలో ఉన్నారని వారు కూడా ఊరి బడి అభివృద్ధి కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూ.టి.యఫ్ జిల్లా కార్యదర్శి కంబగిరి,రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మీప్రసన్న మండల ప్రధాన కార్యదర్శిలు శేఖర్,గంగులయ్య,ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ,నరసింహులు పిన్నా సుధాకర్,రాముడు,రామసుబ్బన్న,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు దైవాభిషేకమ్మ,రామ్ నాయక్,రవి ప్రకాష్,బాలగంగాధర్,రామకృష్ణ, సురేంద్ర,తిరుపాలయ్య,సూర్యనారాయణ రెడ్డి,రమణారెడ్డి,వీర ప్రసాద్ గురువిరెడ్డి,తిరుపాల్,విజయ భాస్కర్,జమీల్ అహ్మద్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు