ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
ఘాట్ కేసర్, జూన్ 17: అన్నోజిగూడ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీం రేవంత్ యువసేన రాష్ట్ర సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్...