ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చిన్నారి కీర్తనకు ప్రాణ బిక్ష పెట్టండి..లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయకపోతే కీర్తన బ్రతకదని డాక్టర్స్ వెల్లడి
పల్నాడుజిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26) వినుకొండ మండలం పెద్ద కంచర్ల యం పి పి పాఠశాల లో 4వ తరగతి చదువుతున్న కీర్తనఈ చిట్టీ తల్లికి కష్టం వచ్చింది ప్రభుత్వ పెద్దలు దాతలు సహాయ సహకారాలు అందిస్తే కానీ ఆ చిన్నారికి వచ్చిన కష్టం తీరదు. అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ చదువుకునే పసి వయస్సులో పాపం ఆ చిన్నారి దవాఖానా లకు తిరుగుతుంది. కామెర్లే కదాని వినుకొండ వైద్యాశాలకు వెళ్తే పెద్ద డాక్టర్ లకు చూపించమనివినుకొండ స్థానిక వైద్యులు తెలుపడంతో రెక్కా డితే కానీ డొక్కాడని ఆ...