prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 5:40 am Digital Edition : PRUDVIRAJU MIRYALAGUDA

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 సం” గాను అడ్మిషన్స్ ప్రారంభం ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమానికి * హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 సం” గాను అడ్మిషన్స్ ప్రారంభం ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమానికి

* హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట ఏప్రిల్ 13 (ప్రజావాణి)

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరంకు గాను అడ్మిషన్ల కోసం కళాశాలలో నిర్వహించిన సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ అధ్యక్షత వహించగా జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ జాతీయ స్థాయి అర్హత గల మరియు పరిశోధన అనుభవం గల అధ్యాపకులు ఉన్నారన్నారు. అదే విధంగా, అత్యుత్తమ ప్రతిభ గల అధ్యాపకులచే ఆధునిక పద్ధతులలో విద్యాబోధన జరుగుతుందన్నారు. డే స్కాలర్స్ విద్యార్థుల కోసం మిడ్డే మీల్స్ (మధ్యాహ్న భోజనం) ఏర్పాటు చేశారన్నారు. ఈ కళాశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం కలదన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తుకై జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో చేరాలన్నారు. అనంతరం కళాశాల అడ్మిషన్ల కై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు