prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 4:02 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నారీశక్తి ప్రోగ్రాo

వై.ఎస్.ఆర్ కడప జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్13)పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ ఆదేశాల మేరకు ఉమన్ రిజర్వేషన్ బిల్- 2023 నారి శక్తి వందన అభియాన్ కార్యక్రమం కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అధ్యక్షులు డాక్టర్ ఎం వి సులోచన ఆధ్వర్యంలో మహిళా విద్యార్థులకు ఉమెన్ రిజర్వేషన్ 2023 బిల్లుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు మాట్లాడుతూ మహిళలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటుగా రాజకీయ రంగంలో కూడా ఉత్తమంగా రాణించాలంటే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్ 2023 ను పార్లమెంటు ఆమోదం తెలిపి చట్ట రూపంలో రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు డాక్టర్ సబితా, పర్వీన్, గుర్రమ్మ ఇతర అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు