prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 1:51 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీస్ శాఖ తరపున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు “పోలీస్ ఔట్ పోస్ట్” జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH) ప్రాంగణంలో,శ్రీ అలపర్తి లక్ష్మయ్య జ్ఞాపకార్థం ప్రముఖ వైద్యులు శ్రీమతి డా.అలపర్తి.నందన ప్రియ,నందన హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో నిర్మించబడిన నూతన పోలీస్ ఔట్ పోస్ట్ ను ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.గుంటూరు సూపరింటెండెంట్ డా.రమణఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ,రిబ్బన్ కత్తిరించి పోలీస్ ఔట్ పోస్ట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణానికి సహకారం అందించిన నందన హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్మా,ట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయడం అత్యంత అవసరమైన మరియు ప్రజలకు ఉపయోగకరమైన చర్య అని తెలిపారు.ప్రమాదాలు,ఇతర ఘటనల్లో గాయపడిన వారికి MLC సర్టిఫికెట్లు జారీ చేయడం మరణించిన వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు తెలియజేయడం వంటి విధుల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఆసుపత్రిలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించేందుకు,అలాగే బాధితులు తమ ఫిర్యాదులను పోలీసులకు అందించేందుకు ఈ ఔట్ పోస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ పోలీస్ ఔట్ పోస్ట్‌లో 5 మంది పోలీస్ సిబ్బంది 24 గంటలు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారని,ఆసుపత్రిలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించి పై అధికారులకు సమాచారం అందిస్తారని వివరించారు.ఆసుపత్రిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు.గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్,మాట్లాడుతూ కోస్తాంధ్రలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆసుపత్రిగా నిలిచిందని,ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుండి వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తారని తెలిపారు.ఇలాంటి ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రిలో పోలీస్ ఔట్ పోస్ట్ అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.అరండల్ పేట ROB నిర్మాణ పనుల కారణంగా పాత ఔట్ పోస్ట్ తొలగించబడగా,ప్రముఖ వైద్యురాలు డా.అలపర్తి నందన ప్రియ సహకారంతో వెంటనే నూతన ఔట్ పోస్ట్ నిర్మించబడిందని తెలిపారు. ప్రమాదాలు,మరణాలు, ఫోరెన్సిక్ మరియు లీగల్ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడంలో ఈ ఔట్ పోస్ట్ బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రసిద్ధి చెందిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు,సిబ్బంది మరియు ఆసుపత్రి అధికారులను కోరారు.పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటుకు సహకారం అందించిన డా.నందన ప్రియ,కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్,గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్,ఈస్ట్ డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్,GGH సూపరింటెండెంట్ డా.SSV రమణ,SB డీఎస్పీ అలహారి శ్రీనివాస్,కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి లాలపేట సీఐ శివప్రసాద్,ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్,ఇతర పోలీస్ అధికారులు ఆసుపత్రి యాజమాన్యం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు