ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి;;ఎన్.ఎస్.యూ.ఐ, వై.ఎస్.ఆర్.ఎస్.యూ ఆగ్రహం
అన్నమయ్య జిల్లా:ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్09)పీలేరు,ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి మండల విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎన్.ఎస్.యూ.ఐ, వై.ఎస్.ఆర్.ఎస్.యూ ఆగ్రహం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మార్చి 16 నుండి పాఠశాలలను ఒంటిపూట బదులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పీలేరు మండలంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ రోజంతా తరగతులు నిర్వహిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ,వై.ఎస్.ఆర్.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేష్ కుమార్,ఎన్.ఎస్.యూ.ఐ...