prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 11:58 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి;;ఎన్.ఎస్.యూ.ఐ, వై.ఎస్.ఆర్‌.ఎస్‌.యూ ఆగ్రహం

అన్నమయ్య జిల్లా:ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్09)పీలేరు,ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి మండల విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎన్.ఎస్.యూ.ఐ, వై.ఎస్.ఆర్‌.ఎస్‌.యూ ఆగ్రహం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మార్చి 16 నుండి పాఠశాలలను ఒంటిపూట బదులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పీలేరు మండలంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ రోజంతా తరగతులు నిర్వహిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ,వై.ఎస్.ఆర్‌.ఎస్‌.యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేష్ కుమార్,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు సి. సాయి సంపత్ కలిసి పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి,విద్యా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి,వారి సమక్షంలోనే నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న తరగతులను తక్షణమే నిలిపివేయించి,విద్యార్థులను ఇండ్లకు పంపించారు.ఈ సందర్భంగా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ,విద్యా శాఖ అధికారులు ఏమి చేస్తున్నారు,అని ప్రశ్నించారు.పీలేరు మండలంలో నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ, మండల విద్యా శాఖ అధికారులు కనీస పర్యవేక్షణ కూడా చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే ఆ పాఠశాలలపై సీజ్,గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పీలేరు మండల విద్యా శాఖ అధికారులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.విద్యాశాఖ అధికారులు స్పందించిన పక్షంలో ఎన్.ఎస్.యూ.ఐ ,వై.ఎస్.ఆర్‌.ఎస్‌.యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి విద్యా శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కాపాడడంలో విద్యార్థి సంఘాలు ఎప్పటికీ ముందుంటాయి అని స్పష్టం చేశారు