prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 11:42 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వము ప్రజాప్రతినిధులు కంపెనీ పక్షం కాకుండ పేదలపక్షంనిలబడండి

ప్రజావాణి: బ్రహ్మంగారి పంటలు పండే భూములు,పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములను సోలార్ పవర్ ప్రాజెక్టు కేటాయించటం అన్యాయం ప్రభుత్వము ప్రజాప్రతినిధులు కంపెనీ పక్షం కాకుండ పేదలపక్షంనిలబడండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన పంటలు పండే భూములను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం బృందం
బ్రహ్మంగారి మఠం మండలంలోని పలుగు రాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె రెవెన్యూపొలంలోని 400 ఎకరాల ప్రభుత్వ మరియు పేదల అనుభవంలోని మరియు పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములను సోలార్ పవర్ ప్రాజెక్టు కేటాయించడం దుర్మార్గమని వెంటనే ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి,శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బ్రహ్మంగారిమఠం మండలంలోని చెంచయ్య గారి పల్లె గ్రామస్తులు సాగు చేసుకుంటున్న అరటి టమోటా, మొక్కజొన్న ఇతర ప0టపొలాలను సోలార్ పవర్ ప్రాజెక్టు కు కేటాయించిన నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోవ్యవసాయం చేసుకుంటూ వాటి ద్వారానే జీవనం గడుపుతున్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టి పచ్చని పంట పొలాలను సోలార్ పవర్ ప్రాజెక్టుకి కేటాయించడం. దుర్మార్గమని వారన్నారు.స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి పేదవాడికి ఎకరా భూమి పంచుతానని ఓ పక్క చెబుతూ మరో ప్రక్క తన సొంత మండలంలో తన సొంత పంచాయతీపక్కనే పేదల అనుభవంలో ఉన్నటువంటి పంటలు పండేభూములను పేదలకు తక్కాల్సిన అసైన్డ్ భూములను సోలార్ కంపెనీకి కేటాయిస్తూ ఉంటే చూస్తూ ఉండటం ఎమ్మెల్యే గారికి సరికాదని వారన్నారు, సోలార్ కంపెనీ ఒప్పందాలు తన ప్రభుత్వంలో జరగలేదని వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పేసి చేతులు దులుపుకోవడం ఎమ్మెల్యే గారికి సరికాదని వారన్నారు, ఇప్పుడు సోలార్ వాళ్లకి కేటాయించిన భూములన్ని, పలుగురాళ్లపల్లె ముడుమాల,ఎర్రం పల్లె, పాపిరెడ్డి పల్లె,చెంచయ్య గారి పల్లె,మల్లేపల్లి,ఎద్దులాయపల్లె. మొదలగు గ్రామాలలోని దళితులకు భూములేని ఇతర వర్గాల ప్రజలకు భూములు పంచడానికి అనువైన ప్రాంతమని, ఇప్పటికే ఇక్కడ అసైండ్ పట్టాలు పొంది ఉన్నారని ఇటువంటి ప్రాంతాన్ని సోలార్కు కేటాయించటం సరైనది కాదని ఉన్నటువంటి భూమిని అంతా సోలార్కు కేటాయిస్తే భూమి లేని పేదలకు ఎక్కడ నుండి భూమి తెచ్చి పంచుతారని వారు విమర్శించారు నాయకుల స్వలాభం కోసం అధికారుల కమిషన్ల కోసం ప్రజలను భయపెట్టో బుజ్జగించో నిరుత్సాహ పరచి, భూములు కంపెనీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వము ప్రజాప్రతినిధులు రైతులు,భూమిలేని దళితుల,పేదల పక్షం ఉంటారో కంపెనీ పక్షం ఉంటారో తేల్చుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు, వెంటనే సోలార్ పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలని పేదల అనుభవంలో ఉన్నటువంటి భూములను పేదలకు చెందిన భూములను అసైన్డ్ భూములను భూమిలేని ఇతర వర్గాల పేదలకు పంచిన తర్వాతేనే మిగులు భూముల్లో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవాలని అలా జరగని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని ఉద్యమానికి సన్నద్ధం అవుతామని వారు హెచ్చరించారు, ఈ పర్యటనలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోవిందస్వామి సునీల్ అజయ్ కుమార్ నరసింహా తదితరులు పాల్గొన్నారు