ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కవులకు ఘన సన్మానం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) పోరుమామిళ్ల, ప్రపంచ పుస్తకపు దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్లలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.మదర్ థెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ సమీపంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సూచనలు మేరకు రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాలకొలను రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, ఉపాధ్యాయుడు తిరువీధి జయరాములు పాల్గొన్నారు.ప్రారంభంలో సరస్వతి దేవి విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన,ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం...