బెజ్జంకి, జూన్ 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు, నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన ఓటర్లు తమ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ప్రత్యేక సవరణ సందర్భంగా సరిచేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ జెల్ల ప్రభాకర్ యాదవ్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, బూత్ ఇన్‌చార్జి, వార్డు సభ్యుడు బోనగం రమేష్ గౌడ్, నాయకులు బోనగిరి శ్రీనివాస్, బీఎల్ఓ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.