ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కీలకం: తహసీల్దారు చంద్రశేఖర్
ఘట్‌కేసర్, జూలై 15: భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత పటిష్టంగా, పారదర్శకంగా, ప్రజలకు చేరువ చేసే దిశగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని తహసీల్దారు చంద్రశేఖర్ అన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ చౌదరిగూడ పరిధిలోని వెంటాద్రి టౌన్‌షిప్ ఫేజ్-1, 2, 3, స్వర్ణగిరి, విజయపురి తదితర కాలనీలలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, కొండాపూర్‌కు చెందిన సుమారు 40 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు బీఎల్‌వోలతో కలిసి...