prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 4:25 pm Digital Edition : NAGARAJU SHANKARAMPET

ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టుకోవాలి చందాపూర్ సర్పంచ్ కృష్ణ గౌడ్

చిన్నశంకరంపేట,జూలై29, మన ప్రజావాణి:తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ జలసిరి గ్రామ స్థాయి భూగర్భ జలాల సంరక్షణ పథకంలో భాగంగా బుధవారం చిన్న శంకరంపేట మండలంలోని చందాపూర్ గ్రామంలో సర్పంచ్ చెన్నాగౌని కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టనున్న ఇంకుడు గుంతలు ఫామ్ పాండ్లు బోర్‌వెల్ రీఛార్జ్ కమ్యూనిటీ సోక్‌పిట్ మ్యాజిక్ డ్రెయిన్ తదితర పనులపై గ్రామస్థులకు అధికారులు అవగాహన కల్పించారు.పథకం ద్వారా రైతులకు గ్రామాలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతు పొలంలో ఫామ్ పాండ్ ఏర్పాటుకు అధికారులు కొలతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతరాజు శేఖర్, పంచాయతీ కార్యదర్శి పద్మ, అంగన్వాడి టీచర్ స్వప్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.