ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.1.50 లక్షల ప్రోత్సాహకం పటాన్చెరు, జూలై 6(ప్రజావాణి): ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పటాన్చెరులోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ విద్యార్థులను సత్కరించి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి...