prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:51 am Digital Edition : PRAJA VANI

ప్రతిపక్ష పార్టీపై వరుసకేసులతో చర్చ

శ్రీకాకుళం జిల్లాలో
ప్రతిపక్ష పార్టీపై  వరుస పోలీసు కేసులుతో  ఇక్కడ చర్చ జరుగుతుంది.

జిల్లాలో వైసిపి పార్టీ కు ఉక్కిరిబిక్కిరి  చేస్తున్నది ఎవరు?

మాజీ స్పీకర్ తమ్మినేనికి బెయిల్ మంజూరు అయింది .

మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పై పెట్టిన కేసులకు బెయిల్ మంజూరు కు  రంగము సిద్ధము ..

మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజుకు మాత్రము రెండు వారాలు దాటిన బెయిల్ మంజూరు కాలేదు .

పలాస ప్రజావాణి ప్రతినిధి

ప్రశాంత శ్రీకాకుళం జిల్లాలో అశాంతి రాజకీయ వాతరణం నెలకొంది. ఇక్కడ  గతము లో  పాలనచేసిన నేతలు నుంచి  ఇక్కడ ఎలాంటి కక్ష సాధింపులు లేవు. తెలుగు దేశము, కాంగ్రెస్స్ పార్టీ అలాగే అన్ని పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా నిజాయితీగా పనిచేసే వారనీ ఇక్కడ చర్చ జరుగుతుంది. స్వర్గీయ మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు అలాగే మాజీ ముఖ్య మంత్రి  డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇక్కడ ఎలాంటి రాజకీయ కక్ష  అరెస్టులు,ఇబ్బందులు లేవని ఆనాటి వారు తెలిపారు.
ప్రస్తుతము  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై పెట్టిన కేసుకు బెయిల్  వచ్చింది.అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పై పెట్టిన కేసులకు బెయిల్ మంజూరు వచ్చిందనీ తెలిసింది.ఇంత జరిగిన మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు కు రెండు వారాలు దాటిన బెయిల్ మంజూరు కాకపోవడం పై ఇక్కడ చర్చ జరుగుతుంది.
అప్పల రాజు అసెంబ్లీలో ఆనాటి ప్రతిపక్ష మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అసెంబ్లీ లో ఆనాటి పలాస ఎమ్మెల్యే అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వల్ల అప్పలరాజు కు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అదే అసెంబ్లీ లో అప్పటి ఎమ్మెల్యే అప్పల రాజు మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు  మానసిక  రోగి అని అన్నారు. అవకాశమిస్తే తానే వైద్యము  చేస్తానని అన్నారనీ ప్రస్తుతం ఇక్కడ చర్చ జరుగుతుంది. .అలాగే నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ ను .. బూట్లు తో కొడితే ఎలా ఉంటుందో ఊహించుకో లోకేష్ అని డాక్టర్ అప్పలరాజు మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. అంతే కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా అప్పలరాజు దురుసు సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే.అందువల్ల ఇక్కడ పలాస లోని ప్రతి పక్ష పార్టీ నేత అప్పల రాజుకు ఇబ్బందులు వచ్చాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పై ప్రజలు ల్లో రకరకాలుగా చర్చ జరుగుతుంది. అప్పలరాజు పై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.