prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:10 am Digital Edition : PRAJA VANI

*ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన గ్రామసభలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

*ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన గ్రామసభలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజావాణి శాయంపేట మండల్- అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తాం పెద్దకొడేపాక  గ్రామ సభలో ఎమ్మెల్యే జీఎస్సార్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామసభలు కీలక వేదికలుగా మారుతున్నాయని పెద్దకోడపాక గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలో  గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రవీందర్రావు గారితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరి చేసినట్లు,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తో పాటు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నట్లు, రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఇచ్చామని, రైతులు పండించిన సన్నబడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా కల్పించామని వివరించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి ఇప్పటికే 3500 ఇండ్లు మంజూరి అయ్యాయని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా తీసుకొచ్చామని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏ.టి. సి) ను తీసుకొచ్చామని దీని ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా,వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్.డి.ఓ , శాయంపేట తహసీల్దార్ , ఎంపీడీఓ ,విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.