ప్రజా సమస్యల పరిష్కారమే మా బాధ్యత: ప్రజా దర్బార్‌లో అర్జీదారులకు భరోసా కల్పించిన శ్రీ కె. రితేష్ రెడ్డి

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)బద్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపే ఉద్దేశంతో బద్వేల్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది.బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి,మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కె.విజయమ్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి అర్జీదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ప్రజలు తమ సాగునీరు,తాగునీరు,పెన్షన్లు మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై సమర్పించిన వినతి పత్రాలను రితేష్ రెడ్డి గారు స్వయంగా స్వీకరించి,వినతిదారుల విన్నపాలను ఓపికగా విన్నారు.వినతులు...