తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద “నీటి సంరక్షణకు సుస్థిర ఆంధ్రకు మార్గం”అనే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే.గత వైసిపి ప్రభుత్వ హయాంలో వాగులు,వంకలు,చెరువులు వైసిపి నాయకుల కబ్జాలపరమయ్యాయి మన ఈ కూటమి ప్రభుత్వ రాకతో నీటి సంరక్షణకు సాగునీటి సంఘాల ద్వారా పటిష్టపరిచి భూగర్భ జలాలను పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది.ఎమ్మెల్యే పులివర్తి నాని.తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద “నీటి సంరక్షణకు-సుస్థిర ఆంధ్రకు మార్గం”అనే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆధ్వర్యంలో పేరూరు చెరువుకట్ట పైన జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,ఆర్డీవో రామ్మోహన్.స్వయంగా ఎమ్మెల్యే.నడుపుతున్న ద్విచక్ర వాహనంలో కలెక్టర్ని ఎక్కించుకుని చెరువుకట్ట పరిసరాలను పరిశీలించారు.చెరువు కట్ట సంరక్షణకు జల వనరుల శాఖ అధికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన కలెక్టర్,ఎమ్మెల్యే.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా నీటి నిల్వలు పెరిగి.వ్యవసాయానికి,త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.రానున్నది ఎండాకాలం.వేసవి తాపానికి ప్రజలు,రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందస్తు జాగ్రత్తలు భాగంగా ఈ కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం చేపడుతుంది.ఎమ్మెల్యే.100 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో చెరువులను,నీటి కుంటలను కాపాడుకుంటూ నీటి వనరులను పెంచుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘ సభ్యులు,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు