ప్రజా ప్రయోజనాలకు భంగం కల్గిస్తే చూస్తూ ఊరుకోం: లీజు పేరుతో రెవిన్యూ స్థలాన్ని కాజేసే ప్రయత్నాలపై ప్రజా, జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం

పోరుమామిళ్ల, జులై 16: ప్రజావాణి స్థానిక రెవిన్యూ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా ప్రయోజనాలను కాలరాస్తూ, ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. మైదుకూరు రోడ్డు వైపు ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంపై కొంతమంది స్వార్థపరుల కన్ను పడిందని, ఎలాగైనా ఆ స్థలాన్ని కాజేసేందుకు తెరవెనుక ముమ్మరంగా పావులు కదుపుతున్నారని వారు ఆరోపించారు. ప్రధాన ముఖద్వారాన్ని మాయం చేసే కుట్ర:ప్రభుత్వ రికార్డుల ప్రకారం అధికారికంగా ప్రజల...