ప్రజావాణి న్యూస్:(మార్చి 08) కడప జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు యువత సిద్ధం కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కన్వీనర్ సాజిద్ హుసేన్ యువతకు పిలుపునిచ్చారు ఈసందర్భంగా సాజిద్ హుసేన్ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఉన్న పార్టీల పేర్లు మార్చుతున్నాయి గానీ సామాన్య ప్రజల భవిష్యత్తు మారడం లేదంటూ ఆయన అభిప్రాయంవ్యక్తంచేశారు ప్రజా భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మార్చాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి హానెస్ట్ పార్టీని మన జిల్లాలోనూ మన రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా ప్రజలకు సూచిస్తున్నామన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యువత ముందడుగు వేయాలని శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తెచ్చి రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు ఇదివరకు మన రాష్ట్రంలో ఎన్నికలకు డబ్బు బలం మధ్య బలం తో అధికారంలో వచ్చిన ఆ పార్టీలు ఆ నాయకులు గద్దెనెక్కాగా ఏ విధంగా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను దోచుకుంటున్నారో తెలియని అంశమైతేి కాదని విద్య వైద్యం విద్యుత్ తాగునిటీ సాగునిటీ పారిశోద్యంలో రోడ్డు లైట్లు కార్పొరేటర్ సంస్థల పెత్తందారి కనుసందాల్లో నడుస్తుందని వాటిని గాడిలో పెట్టేందుకు ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వీటిని సరైన గాడిలో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు గ్రహించాలన్నారు ఇందుకు ఉదాహరణ ఢిల్లీలో శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విద్య వైద్యం ఉచిత కరెంటు తాగునీరు సాగునీరు మహిళలకు ఉచిత బస్సు నూతన కాలవలు నూతన రోడ్డు నిర్మాణాలు రాష్ట్ర సుందరీకరణను యువతరాల భవిష్యత్తు మార్చే దిశగా తెచ్చిన పెను మార్పులే కారణమని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ నేటి యువతరానికి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీ దేనని వారు ప్రజలకు సూచించారు కావున రాబోవు ప్రతి ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీతో నడిచేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలని పేరుపేరునా కొడుతున్నామంటూ సాజిద్ హుస్సేన్ ప్రజలకు సూచించారు… ఈకారిక్రమoలో జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా. జిల్లా ఉపాధ్యక్షుడు దాదా పీర్. సూపర్ సన్ డాక్టర్ బేరీల శ్రీనివాసులు యూత్ విగ్. SMD ఆరిఫ్. ఆశరఫ్ తదితరులు పాలొగొన్నారు