prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 2:09 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలి,జిల్లా కలెక్టర్ కె హేమావతి..

 

సిద్దిపేట ఏప్రిల్ 6 ప్రజావాణి

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అధికారులను ఆదర్శించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. వాటిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఆయా శాఖల జిల్లా అధికారులకు వాటి పరిష్కారం కోసం అందజేసి వారం రోజులలోగా సమస్యలుగా పరిష్కరించి నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు. 216 దరఖాస్తులను వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేశారు.ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఆయా శాఖలకు నిర్వహించిన వారాలలో చేయవలసిన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు 5 నెలల క్రితం చనిపోయిన కోహెడ మండలం చెంచల్ చెరువు పల్లి ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ జె. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా 1 లక్ష 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును జిల్లా కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..