*ప్రజావాణి కథనానికి స్పందన… సింగరాయపల్లె ఆర్ఓ ప్లాంట్ కు తాళాలేసి పంచాయతీకి అప్పగించిన ఎంపీడీవో*

కలసపాడు(జూలై 04 ప్రజావాణి) ప్రజల సమస్యలపై ప్రజావాణి పత్రికలో వచ్చిన కథనానికి మండల ఎంపీడీవో తక్షణమే స్పందించారు.ఎగువ తంబళ్లపల్లె పంచాయతీ పరిధి సింగరాయపల్లె గ్రామంలోని ప్రభుత్వ ఆర్ఓ ప్లాంట్ దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన ఎంపీడీవో,వెంటనే ప్లాంట్ కు తాళాలు వేసి దాని నిర్వహణ బాధ్యతలను సింగరాయపల్లె గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఇకపై ప్లాంట్ పూర్తిగా పంచాయతీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది.ప్రజలకు న్యాయమైన నీరు పంచాయతీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాంట్ ద్వారా...