కలసపాడు(జూలై 04 ప్రజావాణి) ప్రజల సమస్యలపై ప్రజావాణి పత్రికలో వచ్చిన కథనానికి మండల ఎంపీడీవో తక్షణమే స్పందించారు.ఎగువ తంబళ్లపల్లె పంచాయతీ పరిధి సింగరాయపల్లె గ్రామంలోని ప్రభుత్వ ఆర్ఓ ప్లాంట్ దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన ఎంపీడీవో,వెంటనే ప్లాంట్ కు తాళాలు వేసి దాని నిర్వహణ బాధ్యతలను సింగరాయపల్లె గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఇకపై ప్లాంట్ పూర్తిగా పంచాయతీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది.ప్రజలకు న్యాయమైన నీరు పంచాయతీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాంట్ ద్వారా గ్రామంలోని ప్రతి కుటుంబానికి నామమాత్రపు ధరకే స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు.దీనివల్ల ప్రజలకు అధిక ధరల భారం తగ్గడంతో పాటు పారదర్శకంగా నీటి పంపిణీ జరుగుతుంది.
గ్రామస్తుల కృతజ్ఞతఅధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. “ప్రజావాణిలో వార్త వచ్చిన మరుసటి రోజే ఎంపీడీవో వచ్చి ప్లాంట్ కు తాళం వేసి పంచాయతీకి ఇచ్చారు.ఇకపై మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని గ్రామస్తులు అన్నారు.ప్రభుత్వ ఆస్తులు ప్రజల కోసమే.వాటిని ఎవరూ దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాంట్ ను నడుపుతూ ప్రతి ఒక్కరికీ సమానంగా నీరు అందేలా చర్యలు తీసుకుంటాము”అని ఎంపీడీవో తెలిపారు.ప్రజా సమస్యలపై అధికారుల చొరవతో సింగరాయపల్లె గ్రామస్తుల దాహార్తి తీరనుంది.ప్రజావాణి కథనం వల్ల సమస్య పరిష్కారమైనందుకు గ్రామస్తులు పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు