prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:46 am Digital Edition : PRAJA VANI

ప్రజావాణి కథనానికి స్పందించిన  తహసిల్దార్

*ప్రజావాణి కథనానికి స్పందించిన  తహసిల్దార్*
▪️మధ్యాహ్నం భోజనం లో పురుగులు సాంబార్ నీళ్లు వచ్చారు: అనే శీర్షికన వార్తకు స్పందించిన అధికారులు
చిన్నశంకరంపేట,ఆగస్టు 07, మన ప్రజావాణి:మండలంలోని శాలిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లో పురుగులు సాంబార్ నీళ్లు అనే శీర్షికన గురువారం రోజున వచ్చిన వార్తకు స్పందించిన తహసిల్దార్ పాఠశాలకు వెళ్లి ముక్కిపోయిన బియ్యాన్ని వెంటనే పౌరసరఫరాల శాఖకు తిరిగి పంపించాలని, ప్రధానోపాధ్యాయులు భాస్కరరావును ఆదేశించారు. అలాగే మెనూ ప్రకారం భోజనం అందించాలని నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని వంట నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, ప్రధానోపాధ్యాయుడు భాస్కరరావు, జిపిఓ యాదగిరి ,ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులు, పాల్గొన్నారు.