prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 11:16 am Digital Edition : RAJASHEKARREDDY

ప్రజావాణి కథనానికి స్పందన – రహదారిపై పడిన చెట్ల తొలగింపు

 

బెజ్జంకి,జూన్ 14 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ నుండి గుగ్గిళ్ళ గ్రామానికి వెళ్లే రహదారిపై ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా కూలిపోయిన చెట్లపై ప్రజావాణి దీనపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న చెట్లను గుర్తించి సంబంధిత సిబ్బంది శనివారం తొలగింపు చర్యలు చేపట్టారు.చెట్లను తొలగించి రహదారిని పూర్తిగా వాహనాల రాకపోకలకు అనుకూలంగా మార్చడంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన బెజ్జంకి మండల ప్రజావాణి రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరారు.