ప్రజారోగ్య సేవలో అంకితభావం – సాధు వెంకటేశ్వర్లుపై ఆరోపణలు అవాస్తవం

కడప జిల్లా,పోరుమామిళ్ల (ప్రజావాణి, జూన్ 19):ఆరోగ్య విద్యాధికారి శ్రీ సాధు వెంకటేశ్వర్లు పై ఇటీవల వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధమని స్థానిక ప్రజలు, సహోద్యోగులు మరియు వైద్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.శ్రీ సాధు వెంకటేశ్వర్లు  తన 35 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలంలో ఎక్కడా,ఎవరి వద్దా ఏమి ఆశిషకుండా అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు.ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనకు స్థానిక ప్రైవేట్ క్లినిక్‌లు,ల్యాబొరేటరీలు లేదా మెడికల్...