prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 10:05 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రజారోగ్య సేవలో అంకితభావం – సాధు వెంకటేశ్వర్లుపై ఆరోపణలు అవాస్తవం

కడప జిల్లా,పోరుమామిళ్ల (ప్రజావాణి, జూన్ 19):ఆరోగ్య విద్యాధికారి శ్రీ సాధు వెంకటేశ్వర్లు పై ఇటీవల వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధమని స్థానిక ప్రజలు, సహోద్యోగులు మరియు వైద్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.శ్రీ సాధు వెంకటేశ్వర్లు  తన 35 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలంలో ఎక్కడా,ఎవరి వద్దా ఏమి ఆశిషకుండా అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు.ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనకు స్థానిక ప్రైవేట్ క్లినిక్‌లు,ల్యాబొరేటరీలు లేదా మెడికల్ షాపులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని, కమీషన్ వ్యవహారాలకు ఎప్పుడూ తావివ్వలేదని తెలిసింది. పేద మరియు నిరుపేద రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటున్నారు.రోగులను ప్రైవేట్ వైద్య సేవల వైపు మళ్లించకుండా, ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, నిబంధనల ప్రకారం సిబ్బందిని నడిపిస్తున్నందున కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.శ్రీ సాధు వెంకటేశ్వర్లు నిజాయితీ, సేవా తత్వం మరియు కర్తవ్యనిష్ఠను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య, సూపర్వైజరీ అధికారి రఘురాములు,ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, వైద్య సిబ్బంది మరియు జిల్లా స్థాయి అధికారులు సైతం గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్య రంగ బలోపేతానికి, ప్రజారోగ్య పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ సాధు వెంకటేశ్వర్లు గారిపై చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రజలు విశ్వసించవద్దని స్థానికులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది కోరుతున్నారు.