ప్రజాభిమానంలో అగ్రస్థానంలో పుత్తూరు, శ్రీకాళహస్తి రవాణాశాఖ కార్యాలయాలు
తిరుపతి, జూన్ 23:ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడంలో తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయాలు విశిష్ట ఫలితాలు సాధిస్తున్నాయని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు.ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ స్పందన విధానంలో పుత్తూరు మోటారు వాహనాల తనిఖీ కార్యాలయం గత రెండు నెలలుగా వరుసగా వంద శాతం సానుకూల ప్రజాభిప్రాయం నమోదు చేసి రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు మొదటి స్థానం సాధించడం విశేషమని తెలిపారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి చంద్రశేఖర్...