ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) రాజంపేట పట్టణం నియోజకవర్గ పార్టీ కార్యాలయం.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.శుక్రవారం నాడు స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలపై నేరుగా శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు వినుతులను స్వీకరించారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు,వెంటనే పరిష్కార దిశగా చర్యలు చేపట్టేందుకు ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చమర్తి జగన్ మోహన్ రాజు. తెలియజేశారు.అదేవిధంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి,సంక్షేమాలను రెండు కళ్ళుగా భావించి సమన్వయంతో పాలన సాగిస్తున్నామని చమర్తి తెలియజేశారు.అంతకుముందు భూ సమస్యలు,వీటితో పాటు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సామాజిక పెన్షన్లు ఇండ్ల స్థలాలు తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై వినతులు అందాయన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సి సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నె సుబ్బ నరసయ్య నాయుడు,సొసైటీ చైర్మన్ ములగూరు సుబ్రహ్మణ్యం నాయుడు,ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్,మార్కెట్ వైస్ చైర్మన్ చంగల్ రాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జీవీ సుబ్బరాజు,మాజీ పట్టణ అధ్యక్షులు సంజీవరావు, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి ఎస్కే కరీమ్,ఒంటిమిట్ట సీనియర్ నాయకులు ఎస్వి రమణ,మండల క్లస్టర్ ఇన్చార్జ్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు నాయుడు, సీనియర్ నాయకులు దాసరి కళాధర్,పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ప్ర