prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 1:11 pm Digital Edition : PRAJA VANI

ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజా దర్బార్  ఏర్పాటు చేశాము ఎమ్మెల్యే గౌతు శిరీష

ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే
ప్రజాదర్బార్ ఏర్పాటు చేశాము

ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస ప్రజావాణి ప్రతినిధి

పలాస నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుల  కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన “ప్రజా పరిష్కార వేదిక – ప్రజా దర్బార్” కార్యక్రమం అధికారికంగా నిర్వహించబడింది..
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హాజరై తమ సమస్యలను శాసనసభ్యులు కు  వినిపించారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మరియు భూ వివాద సమస్యలకు సంబంధించిన 37 మంది వినతిపత్రాలను సమర్పించారు.
శాసనసభ్యురాలు ప్రజల వినతులను శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండటం తమ ప్రధాన బాధ్యత అని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయడం ద్వారా వేగవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు మరియు  ప్రజలు పాల్గొన్నారు.