“ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇథనాల్ పరిశ్రమలు”- కాలుష్యానికి వ్యతిరేకంగా అఖిలపక్షం భారీ నిరసన.. ఫ్యాక్టరీలు మూసివేయాలని డిమాండ్

బెజ్జంకి, జూలై 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఇథనాల్ పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.ర్యాలీకి ముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ఎదుట బైఠాయించి ఇథనాల్ పరిశ్రమలకు...