prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 10:20 am Digital Edition : PRAJA VANI

ప్రజలు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి

ప్రజలు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి

*సీనియర్ సివిల్ జడ్జి ఏ నిర్మల*

* *మన ప్రజావాణి*, మందమర్రి:- జూలై 4

ప్రజలందరూ తమ హక్కులను తెలుసుకొని, అవసరమైనప్పుడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మంచిర్యాల కార్యదర్శి, సీనియర్ జడ్జీ ఏ నిర్మల తెలిపారు. శనివారం పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి, లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలు అంశంపై లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను పట్టణ మున్సిపల్ కమిషనర్ ఈ రాజలింగు శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్ప గుచ్ఛం అందజేసి, ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ వాహనం ద్వారా దృశ్య ప్రదర్శన ఏర్పాటు చేసి, న్యాయవ్యవస్థ, ఉచిత న్యాయ సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి నిర్మల మాట్లాడుతూ, మహిళలపై జరిగే అన్యాయాలు, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, భూ వివాదాలు, గృహ హింస, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, ముందస్తు జాగ్రత్తలు, అదేవిధంగా అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయ సహాయం ఎలా పొందడం తదితర అంశాలను ప్రజలకు సవివరంగా వివరించారు. ఈ అనంతరం పట్టణంలోని ఎస్వి టెంపుల్ సమీపంలో పాత సిఐఎస్ఎఫ్ బ్యారెక్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు ప్రాంగణాన్ని ఆమె సందర్శించి, పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, మంచిర్యాల చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఎంపీ సంందాని, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఆర్ఆర్ రాములు,ఎస్ సదయ్య, న్యాయవాదులు, భుజంగరావు, సెల్వరాజ్, లక్ష్మణ్, మధుకర్, శ్రీనివాస్, ఆంజనేయులు, శేఖర్, మున్సిపల్ రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, మేనేజర్ టి రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఇంచార్జ్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏ రఘురాం, మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.