ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనకు రెండేళ్లు,,ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం,, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ,
బద్వేల్ జూన్ 3 ప్రజావాణి ఎన్నికల సమయంలో ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి,పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు,కాశినాయన,బి.కోడూరు,పోరుమామిళ్ల మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పోరుమామిళ్లలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.బస్టాండ్ కూడలిలో భారీ నిరసన మరియు అంబేద్కర్ సర్కిల్లో–హామీ పత్రాల...