ప్రజలకు హెచ్చరిక అప్రమత్తంగా ఉండండి

సత్యసాయి జిల్లా జూన్ 08 ప్రజావాణి కదిరి RTC బస్టాండ్‌లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఒక గుర్తు తెలియని మహిళ, మరో మహిళా ప్రయాణికురాలికి వెనుక నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె నగలు అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.అయితే అక్కడ ఉన్న ప్రయాణికులు మరియు స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి, అనుమానిత మహిళను అక్కడికక్కడే నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు .అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించాము.ప్రజలకు విజ్ఞప్తి :ఒంటరిగా ప్రయాణించే మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. చిన్న పిల్లలపై ఎప్పుడూ నిఘా ఉంచండి. బస్టాండ్లు, రైల్వే...