prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 10:31 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రజలకు శుద్ధి జలాలు అందించడమే లక్ష్యం.*ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

నంద్యాల జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) మిడ్తూరు మండలం తలముడిపి గ్రామంలో మినరల్ వాటర్ ఫ్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.పార్లమెంట్ పరిధిలో ఉన్న బడుగు బలహీన వర్గాల కాలనీలలోని ప్రజలకు,పాఠశాలల విద్యార్థులకు శుద్ధి చేసిన వాటర్ అందించేందుకు కృషి చేస్తున్నానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలం తలముడిపి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్ ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. గ్రామాల ప్రజలు కూడా ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫ్లాంట్ల నిర్వాహణ, వాటి చుట్టూ మురుగునీరు నిల్వ ఉండకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తాగునీరు వృధా చేయవద్దని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.అనంతరం తలముడిపి గ్రామంలోని ఉమా సహిత జటేశ్వర స్వామి వార్ల ధ్వజ స్థంభం ప్రతిష్ట పూజ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని, హోమం, అభిషేకం అనంతరం దర్శనం చేసుకున్నారు.గ్రామ టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి, కాతా అంకిరెడ్డి, స్వామిరెడ్డి లు గ్రామంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి ఘన స్వాగతం పలికారు.మిడ్తూరు మండలం వీపనగండ్ల గ్రామంలో గురువారం నాభిశిలా ప్రతిష్ట ( బొడ్రాయి ) మహోత్సవంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని బొడ్రాయికి విశేష పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. వీపనగండ్ల గ్రామంలో కూడా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి అపూర్వ స్వాగతం పలికి సన్మానం చేశారు. గ్రామ టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, పుల్లారెడ్డి లు,టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, సివిల్ సప్లయ్ రాష్ట్ర డైరెక్టర్ మహేష్ నాయుడు,గుణశేఖర్ రెడ్డి, రఘురామిరెడ్డి.స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.