అమరావతి,ప్రజావాణిన్యూస్(మార్చి28):వార్తా ప్రపంచం”జాతీయ తెలుగు దినపత్రిక ప్రచురించిన 2026 ఉగాది ప్రత్యేక డైరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సమాజంలో జర్నలిజం విలువలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు నిజాయితీ గల సమాచారం అందిస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే మీడియా సంస్థలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.ప్రజల సమస్యలను సత్వరంగా వెలుగులోకి తీసుకువచ్చి, పరిష్కార దిశగా దృష్టి సారించే జర్నలిజం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా,పారదర్శకంగా వార్తలను అందించే పత్రికలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు.వార్తా ప్రపంచం వంటి పత్రికలు జర్నలిజం ప్రమాణాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు మరింత విస్తరించాలని మంత్రి ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పత్రిక చీఫ్ ఎడిటర్ & పబ్లిషర్ డా.బండి సురేంద్రబాబు మాట్లాడుతూ.ప్రజల ఆదరణతో 2010లో ప్రారంభమైన ఈ పత్రిక 16 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి, నిజాయితీ గల జర్నలిజాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ డైరీ ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్తా ప్రపంచం చీఫ్ ఎడిటర్ & పబ్లిషర్ డా. బండి సురేంద్రబాబు,”విశ్వదరణి”న్యూస్ ఎడిటర్ మునిపల్లి శ్రీకాంత్, “భారత్ నౌ” రిపోర్టర్ మని, సురేఖ, జర్నలిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు.