ప్రజలకు నాణ్యమైన ఆహారమే లక్ష్యం – హైకోర్టు అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన సీఈఓ వంశీధర్, కమిషనర్ అలీమ్ బాషా

మంగళగిరి జూన్ 02 ప్రజావాణి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలోగల హైకోర్టు అన్న క్యాంటీన్‌ను ఆంధ్రప్రదేశ్ అన్న క్యాంటీన్స్ సంస్థ సీఈఓ వంశీధర్ మరియు మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.అలీమ్ బాషా ఈరోజు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందజేస్తున్న అల్పాహారం,భోజనాల నాణ్యత,ఆహార పదార్థాల నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత,తాగునీటి సదుపాయాలు,భోజనశాల నిర్వహణ,పారిశుద్ధ్య ప్రమాణాలు మరియు మొత్తం నిర్వహణ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార తయారీ మరియు పంపిణీ ప్రక్రియలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు...