ప్రజలకు ఇంధన షాక్.పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెంపు.ఏపీ,తెలంగాణలో లీటర్‌కు రూ.3 వరకూ అదనం
న్యూఢిల్లీ, (మే 15) ప్రజావాణి న్యూస్ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మరోసారి ఇంధన భారం తప్పలేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరలను లీటర్‌కు సగటున రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాహనదారులపై అదనపు భారం పడనుంది.ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరపై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంపు అమల్లోకి రాగా.. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా రూ.3 చొప్పున ధరలు పెరిగాయి. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ కంపెనీలు...