పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

ఘట్‌కేసర్, జూన్ 30: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ పరిధిలోని కాచవాని సింగారంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిఎంసి సభ్యులు తాల్క రాములు మాట్లాడుతూ, పౌర హక్కుల రక్షణ చట్టం (పీసీఆర్–1955) మరియు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (పీఓఏ–1989) అమలు తీరును వివరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టాలు కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. చట్టాల...