prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 11:43 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు ,పిల్లలు భద్రత పై ‘ కమ్యూనిటీ పోలీసింగ్ ‘ ప్రోగ్రాం

కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) బద్వేల్ పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు,పిల్లలు భద్రత పై’కమ్యూనిటీ పోలీసింగ్’ప్రోగ్రాం లో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మహిళలు & పిల్లల కు భద్రత అవగాహన కల్పించడం కోసం గౌరవ డీస్పీ రాజేంద్ర ప్రసాద్,బద్వేల్ సి ఐ రామకృష్ణ గారి ఆద్వర్యం లో మహిళల కు విద్యార్థులకు శక్తీ అప్ గురించి,సోషల్ మీడియా వినియోగం గురించి సూచనలు చేయడం జరిగింది.నేరాలను అరికట్టడం శాంతి భద్రతలను కాపాడడం కేవలం పోలీసుల పని మాత్రమే కాదు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి,ప్రతి ఇంటి నుండి ఒక బాధ్యతాయుత పౌరుడు బయటకు రావాలి.ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన “నారీ శక్తి యాప్”ఒక శక్తివంతమైన ఆయుధం.అత్యవసర సమయంలో ఒక క్లిక్‌తోనే పోలీసులకు సమాచారం చేరే ఈ యాప్ ప్రతి మహిళ ఫోన్‌లో ఉండాలి.ఇది కేవలం యాప్ కాదు.ప్రతి మహిళకు భద్రతకు కవచం.ప్రతి తల్లి,ప్రతి అక్క,ప్రతి చెల్లెలు దీన్ని వినియోగించాలి.యువత గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.మీరు దేశ భవిష్యత్తు.చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.మంచి మార్గంలో నడవండి.సమాజానికి ఆదర్శంగా నిలవండి.అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే మౌనంగా ఉండకండి.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు.మన పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారు.వారి సేవలను మనం గౌరవించాలి,వారికి తోడ్పడాలి.ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి,మాజాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్,సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ,ఎస్ఐ కొండారెడ్డి అట్లూరు ఎస్ఐ నాగకీర్తన,రూరల్ సీఐ కృష్ణయ్య,మహిళా పోలీస్ అధికారి కి,ఇన్స్పెక్టర్ ఎల్లం రాజు  మరియు పోలీసు సిబ్బంది,మహిళలు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .