prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:34 am Digital Edition : PRAJA VANI

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి<br>

*పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి*

*మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్*
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 28:
పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకూడదు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు.