prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 12:45 am Digital Edition : PRAJA VANI

పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు మానుకోండి సిపిఎం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన కూనవరం టీడీపీ శ్రేణులు

“*పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు మానుకోండి: సిపిఎం* *దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన కూనవరం టీడీపీ శ్రేణులు*

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఏప్రిల్. 28.

పోలవరం జిల్లా చింతూరు డివిజన్*కూనవరం మండలం:
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను అడ్డుపెట్టుకుని సిపిఎం పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సిగ్గుచేటని, బాధ్యతారహితమైన ఆరోపణలు మానుకోవాలని కూనవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు కాంటూర్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మండిపడ్డారు.
టిడిపి నాయకుల ప్రధాన విమర్శలు గత ప్రభుత్వం వైఫల్యాలే కారణం*: గత ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితుల ప్యాకేజీని గాలికి వదిలేసిన వారు ఇప్పుడు మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రాజెక్టు పనులను, నిర్వాసితుల సమస్యలను పక్కనబెట్టి నిధుల మళ్లింపు, అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వమేనని వారు గుర్తు చేశారు.
రాజకీయాలు వద్దు.. నిర్మాణాత్మక సూచనలు చేయండి*: కాంటూర్ అనే అంశం సాంకేతికమైనది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పూర్తి పరిశీలన జరిపి, అర్హులైన వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం ప్రభుత్వంపై బురద జల్లడం కోసం, లేనిపోని ఆందోళనలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం సిపిఎంకు తగదు. నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో కలిసి పరిష్కార మార్గాలను చర్చించాలి, అంతే కానీ కాంటూరు పేరుతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు.
*కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి*: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితుల పునరావాసాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతం కంటే మెరుగైన ప్యాకేజీని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన ప్రతి యువకుడికి, ప్రతి నిర్వాసితుడికి చట్టబద్ధంగా అందాల్సిన పరిహారం అందుతుంది. ఎవరినీ రోడ్డున పడేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు.
*హెచ్చరిక*: నిర్వాసితుల జీవితాలతో రాజకీయాలు చేయడం ఆపాలని, లేనిపక్షంలో ప్రజలే సిపిఎం వైఖరిని తిప్పికొడతారని వారు హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రజలను రెచ్చగొట్టే కుట్రలు సాగవని, ప్రజలకు మేలు చేసే విషయంలో టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మండల స్థాయి టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, నిర్వాసితుల సంక్షేమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
టీడీపీ కూనవరం మండల కమిటీ