పోరుమామిళ్ల హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’
పోరుమామిళ్ల జూలై 24 ప్రజావాణి స్థానిక పోరుమామిళ్ల మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ ‘హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం స్కూల్’ లో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ సునీల్,అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫాదర్ సునీల్,మాట్లాడుతూ"మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.బడివైపు ఒక్క అడుగు"అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కేవలం పాఠశాల వల్లే...