పోరుమామిళ్ల జూలై 31ప్రజావాణి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన సమావేశంలో పోరుమామిళ్ల మండల ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఆంధ్ర రాష్ట్రం లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందని వారు అన్నారు.రాష్ట్రంలో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని,జీవో నెంబర్ 77 ను రద్దు చేసి ప్రైవేట్ ఏయిడెడ్ విద్యాసంస్థల పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ కల్పించే విధంగా జీవోను రద్దు చేయాలి విద్యార్థులకు ఉన్నత విద్యను అవకాశాలు పెంచాలని. అదేవిధంగా డిగ్రీ హానర్స్ విధానాన్ని రద్దు చేయాలి విద్యార్థులకు కోర్స్ ఎంపిక చేసే హక్కులను కాలరాస్తుందని పరీక్షా విధానం అంతా గందరగోళం ఏర్పడుతుందని అన్నారు.ప్రభుత్వాలు మారుతున్న సంక్షేమ హాస్టళ్లు రోజురోజుకు దిగజారుతుంది.సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చదువు పేరుతో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డగోళంగా వేల,లక్షల రూపాయలు దోచుకుంటున్నాయని వారన్నారు.కొన్ని సంక్షేమ వసతి గృహాలు సొంత భవనాలు ఉన్న కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు.చాలావరకు అద్దె భవనాల్లో హాస్టల్లో ఉంటున్నారని వారికి ఎలాంటి ప్రభుత్వం మోసం చేస్తుందని వారన్నారు.ఈ విధంగా ఉంటే విద్యార్థులు విద్యకు దూరమవుతారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి వారు అన్నారు. అదేవిధంగా పోరుమామిళ్ల మండలంలోని విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని సిద్ధం అవ్వాలని వారన్నారు.అనంతరం పోరుమామిళ్ల మండల నూతన ఎస్ఎఫ్ఐ అధ్యక్ష,కార్యదర్శులుగా ప్రేమ్ కుమార్,వెంకట రమణ,మండల ఉపాధ్యక్షులుగా స్వాతి,రామయ్య,శిరీష,రాజు,హుస్సేన్.సహాయ కార్యదర్శులుగా విజయలక్ష్మి,సాయిరాం,ఈ రామయ్య శ్రీమన్నారాయణ,శివ.మండల కమిటీ సభ్యులుగా నందకిషోర్,మని దీప్తి, శ్రీకాంత్,అజయ్,రత్నం,సిద్దేశ్వరయ్య,డి అరుణ,వర్షిత,సిరి మొత్తం 21 మంది సభ్యులతో నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందని.వారన్నారు ఈ విధంగా ప్రేమ్ కుమార్,వెంకటరమణ మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి నూతన మండల అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.