పోరుమామిళ్ల మండలంలో పాఠశాలల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీలో రవాణా ఖర్చుల చుట్టూ చెలరేగుతున్న వివాదం

విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో సమగ్ర పోరుమామిళ్ల -ప్రజావాణి న్యూస్ ప్రత్యేక కథనం: పోరుమామిళ్లలో ఉచిత పుస్తకాల ‘రవాణా’ గుట్టు.. ఆ ఖర్చులు ప్రభుత్వం ఇస్తోందా? అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయా? పోరుమామిళ్ల: (ప్రజావాణి జూన్ 21) రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు విద్యాకానుక కింద ఉచితంగా పాఠ్యపుస్తకాలు,యూనిఫారాలు సరఫరా చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని మండల విద్యాశాఖాధికారి (MEO) కార్యాలయానికి భారీగా ప్రభుత్వ పుస్తకాలు చేరుకున్నాయి.అయితే,ఇక్కడి నుంచే అసలు కథ...