పోరుమామిళ్ల  ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పెట్రోల్ బంకులు: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

కడప జిల్లా (ప్రజావాణి జూన్ 17) పోరుమామిళ్ల పట్టణంలోని ఉన్న భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL),మరియు ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన కనీస ప్రాథమిక వసతులు పూర్తిగా మృగ్యమయ్యాయి. లీటర్ల కొద్దీ పెట్రోల్,డీజిల్ అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న బంకుల యాజమాన్యాలు, ప్రజలకు ఉచితంగా అందించాల్సిన కనీస సేవలను గాలికొదిలేశాయి.దీనిపై స్థానిక అధికారులు కంటితుడుపు చర్యలు కూడా తీసుకోకపోవడం,వారి నిర్లక్ష్య వైఖరికి మరియు లాలూచీతనానికి అద్దం పడుతోంది. నిబంధనలు కాగితాలకే పరిమితం! బంకుల్లో కనిపించని కనీస సదుపాయాలు ఆయిల్ కంపెనీల...