పోరుమామిళ్ల పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? న్యాయం చచ్చిందా.. ‘పంచాయతీ’లు రాజ్యమేలుతున్నాయా?
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే08) పోరుమామిళ్ల డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన చేతులే.అక్రమాలకు అండగా నిలుస్తున్నాయా బాధితులకు అండగా ఉండాల్సిన ఖాకీలు.పైరవీకారులకు వంత పాడుతున్నారా ప్రస్తుతం పోరుమామిళ్ల పోలీస్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్య ప్రజల్లో ఇదే అనుమానం వ్యక్తమవుతోంది.1.స్టేషన్లలో 'సెటిల్మెంట్ల' రాజ్యం?పోరుమామిళ్ల డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు బాధితులకు న్యాయం చేసే కేంద్రాలుగా కంటే,వివాదాలను పరిష్కరించే 'పంచాయతీ కేంద్రాలు'గా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కొందరు అవినీతి అధికారులు,కొంతమంది స్వార్థపూరిత జర్నలిస్టులతో చేతులు కలిపి.. స్టేషన్లోనే...