prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 12:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్ల పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు తగ్గించేందుకు చర్యలు లేవా?

ప్రైవేట్ ఆసుపత్రిలో దందా ను అరికట్టే వారే లేరా.?ప్రజావాణిన్యూస్(మార్చి28)పోరుమామిళ్ల పట్టణంలో  ఆపరేషన్లు ఎనేర్చగా కొనసాగుతూ ఉన్నాయంటే అధికారులకు ఏమైనా నెలసరి మామూలు వెళ్తున్నాయా.ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు 90 శాతం ఆపరేషన్లకే మొగ్గుచూపుతున్నారు.ప్రైవేట్ ఆసుపత్రిలో దందాకు అడ్డు అదుపు లేకుండా పోతావుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెట్టారంటే ఆపరేషన్ చేయాల్సిందే.ఇదే తంతుగా పోరుమామిళ్ల ప్రైవేట్ ఆసుపత్రిలలో సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా 90 శాతం ఆపరేషన్ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను పట్టిపీడిస్తున్నారు.ఒక్కో ఆపరేషన్కు సుమారు రూ.50 వేలుకు పైగా వసూలు చేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు వినపడుతున్నాయి. గర్భిణీలకు రెండు నెలల ముందే సలహాలు ఇస్తూ సాధారణ డెలివరీ ఇబ్బందిగా ఉంటుంది కావున ఆపరేషన్ సులువుగా చేస్తామంటూ ప్యాకేజీ ముందుగానే మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పటివరకు పరిశీలిస్తే 90% సిజరిన్ ఆపరేషన్లు మాత్రమే జరుగుతున్నాయి తక్కువ శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి దీనిబట్టి చూస్తే ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో ఇదే నిదర్శనం గా నిలుస్తుంది.గర్భిణీ సమయంలో అన్ని గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు హెల్త్ వర్కర్లు గర్భిణీలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆరో నెల నుంచే ప్రైవేటు ఆసుపత్రికి వెళుతుండడంతో ఇదే ఆసరాగా తీసుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రిలో యజమానులు ప్రజలను పట్టిపీడిస్తున్నారు.కొన్నింటికి సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్న ఆపరేషన్ చేస్తూ వేలకు వేలు వసూలు చేస్తూ ప్రజలను మానసికంగా వేధిస్తున్నారు.ఇలా అయితే పేదల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం వలన ఈ రీతిలో ఆసుపత్రిలో నడుస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఈ విషయాలపై సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.